ఏపీలో అల్లకల్లోలం! 3 రోజులు ఉరుములు, మెరుపులతో కురిసే వర్షాలు

ఏపీలో అల్లకల్లోలం! 3 రోజులు ఉరుములు, మెరుపులతో కురిసే వర్షాలు

Jun 8, 2025 - 16:46
Jun 8, 2025 - 17:12
 0  128
ఏపీలో అల్లకల్లోలం! 3 రోజులు ఉరుములు, మెరుపులతో కురిసే వర్షాలు
ఏపీలో అల్లకల్లోలం! 3 రోజులు ఉరుములు, మెరుపులతో కురిసే వర్షాలు

ఏపీలో అల్లకల్లోలం! 3 రోజులు ఉరుములు, మెరుపులతో కురిసే వర్షాలు. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక, తెలంగాణ మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి బలహీనపడింది. ఏపీలో గాలుల ప్రభావం: ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి.

ఈ గాలుల వల్ల ఏపీ రాష్ట్రంలో తుఫాను వాతావరణం ఏర్పడనున్నది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి శనివారం రోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సంభావ్యత ఎక్కువగా ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎండీ) డైరెక్టర్ శ్రీ కూర్మనాథ్ తెలిపారు.

ఉరుములు, ఈదురు గాలులతో కొన్ని ప్రాంతాల్లో వర్షాల అవకాశం ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

ప్రత్యేకించి ఒకటి లేదా రెండు చోట్ల ఈ వర్షాలు ఎక్కువగా కనిపించవచ్చు.కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదవుతాయని అధికారులు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఏడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది.

ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు,టవర్స్,పోల్స్, పొలాలు,బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి. -ఏపీ విపత్తుల సంస్థ

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News