5 చోట్ల భారీ బాంబ్ బ్లాస్టులకు కుట్ర! NIA విచారణలో కీలక అంశాలు
5 చోట్ల భారీ బాంబ్ బ్లాస్టులకు కుట్ర! NIA విచారణలో కీలక అంశాలు

(బిగ్ బ్రేకింగ్: 5 చోట్ల భారీ బాంబ్ బ్లాస్టులకు కుట్ర! NIA విచారణలో కీలక అంశాలు) మానవబాంబులుగా 20 మంది యువకులు. దేశంలో ఐదుచోట్ల భారీ పేలుళ్లకు కుట్ర. మాతృభూమిలో మారణహోమానికి బడా ప్లాన్‌లే ఉన్నాయి. విజయనగరంలో పట్టుబడిన సిరాజ్, హైదరాబాద్‌లో దొరికిపోయిన సమీర్- బద్మాష్ స్కెచ్‌లను కూపీలాగుతుంటే, షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి.
దేశంలో ఐదుచోట్ల భారీ పేలుళ్లకు సిరాజ్, సమీర్ కుట్రలు చేశారని. NIA దర్యాప్తులో సంచలన కుట్రకోణాలు బయటపడ్డాయి. ఎన్‌ఐఏ అధికారులు విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా ఇవాళ మూడోరోజు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్‌లో నిందితులను ఎన్‌ఐఏ విచారించనుంది.
అయితే నిన్నటి విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజయనగరం, హైదరాబాద్, ముంబైతో పాటు. ఢిల్లీ, బెంగళూరులలో పలుమార్లు నిందితులు ఉగ్రకుట్రకు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈకుట్రలో కీలక సూత్రధారిగా వరంగల్‌కు చెందిన ఫర్హాన్ వ్యవహరించారు. యూపీకి చెందిన బాదర్‌తోనూ సిరాజ్‌కు సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. బాదర్, ఫర్హాన్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
అహీం అనే సంస్థను స్థాపించిన సిరాజ్ మానవబాంబులుగా 20 మంది యువకులను సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. అహీం సంస్థ సభ్యులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే వీరికి ఒమన్, సౌదీ నుంచి నిందితులకు ఆర్థిక సాయం అందినట్లు తెలుస్తోంది. అయితే సిరాజ్, సమీర్లు ఎక్కడెక్కడ బాంబు బ్లాస్ట్ కి పన్నాగం పన్నారనే అంశం పై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. అంతేకాకుండా వారి నెట్ వర్క్ తదితర అంశాలపై వివరాలను సేకరిస్తున్నారు.
What's Your Reaction?






