బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో రోహిణి కార్తె ప్రారంభం అయింది. సాధారణంగా ఈ సమయంలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ ఈసారి కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు. శక్తి తుఫాన్ కొనసాగుతూనే ఉంది. మళ్ళీ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. శక్తి తుఫాన్ వల్ల పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.
రోహిణి కార్తెలోనే ముందుగానే తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. సముద్రంలో తీవ్రమైన అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, గాలి వీచే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది.
అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్ప పీడనం మరింత బలపడే అవకాశముంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో 3 రోజుల పాటు ఒకటి 2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి.
24గంటల్లో పార్వతి పురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై శక్తి తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు,టవర్స్,పోల్స్, పొలాలు,బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి. -ఏపీ విపత్తుల సంస్థ.
What's Your Reaction?






