సముద్రంలో భారీ అలజడి! మునిగిపోయిన పెద్ద షిప్

సముద్రంలో భారీ అలజడి! మునిగిపోయిన పెద్ద షిప్

May 25, 2025 - 21:09
May 25, 2025 - 21:29
 0  230
సముద్రంలో భారీ అలజడి! మునిగిపోయిన పెద్ద షిప్
సముద్రంలో భారీ అలజడి! మునిగిపోయిన పెద్ద షిప్

కొచ్చి తీరంలో హై అలర్ట్‌! మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..! లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో శనివారం ప్రమాదానికి గురైంది. తాజాగా అది పూర్తిగా సముద్రంలో మునిగిపోయినట్లు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ (ICG) ప్రకటించింది.

ఈ నౌకలో 640 కంటైనర్లు ఉండగా వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు తెలిపింది. ఇవి లీకైతే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్‌ ప్రకటించారు. కొచ్చి సమీపంలో సముద్రంలో మునిగిపోతున్న ఒక విదేశీ నౌక నుంచి 21 మందిని భారత కోస్ట్ గార్డ్స్ రక్షించారు.

మిగిలిన వారిని రక్షించేందుకు భారత తీర రక్షక దళం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. లిబియాకు చెందిన ఓడ శనివారం అకస్మాత్తుగా నీళ్లలో మునిగిపోయింది. లిబియా జెండాతో ఉన్న ఈ కంటైనర్ నౌక MSC ELSA 3, మే 23న విజింజం పోర్టు నుండి Marine Fuelతో బయలుదేరింది. మే 24న అది కొచ్చికి చేరుకోవాల్సి ఉంది. రెస్క్యూ ఆపరేషన్‌లో భారత తీర రక్షక దళం మేసర్స్ ఎంఎస్సీ షిప్ మేనేజ్‌మెంట్ మే 24న మధ్యాహ్నం 1:25 గంటల ప్రాంతంలో కేరళ లోని కొచ్చి నుంచి దాదాపు 38 నాటికల్ మైళ్ల దక్షిణ పశ్చిమంలో తీవ్రమైన అలలు వస్తున్నాయని భారత అధికారులకు సమాచారం అందింది.

భారత తీర రక్షక దళం మునిగిపోతున్న నౌకపై విమానం ద్వారా సహాయక చర్యలు చేపట్టింది. నౌకలో ఉన్న 24 మంది సిబ్బందిలో 9 మంది లైఫ్ బోట్లలో ఉన్నారు. మిగిలిన 15 మందిని మొదటగా రక్షించారు. 21 మందిని భారత కోస్ట్ గార్డ్స్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.. భారత తీర రక్షక దళం నౌక నుంచి బయటకు వెళ్ళే మార్గాల దగ్గర అనేక లైఫ్ బోట్లను అందించి. డీజీ షిప్పింగ్ భారత తీర రక్షక దళంతో సమన్వయం చేసుకుని నౌక యజమానులు తమ నౌకకు తక్షణ సాయం అందించాలని కోరారు. దాంతో భారత కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి మునిగిపోతున్న ఓడలోని 21 మందిని కాపాడింది. దాంతో భారీ ప్రాణనష్టం తప్పిపోయింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News