ఏపీ: భారీగా కరోనా కేసులు! ప్రభుత్వం అప్రమత్తం
ఏపీ: భారీగా కరోనా కేసులు! ప్రభుత్వం అప్రమత్తం

ఏపీలో కరోనా కేసులు. ఏపీలో మళ్ళీ కరోనా వైరస్ కలవరం. భారీగా పెరుగుతున్న కరోనా కేసులు. వాతావరణం చల్లబడటంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో మొత్తం 5 కరోనా యాక్టివ్ కేసులు. విశాఖపట్నం, కోనసీమలో మొదట 2 కేసులు వ్యాప్తి చెందాయి. తాజాగా వివిధ ప్రాంతాల్లో మరో ముగ్గురు కూడా కరోనాతో బాధపడుతున్నట్లు తేలింది.
పశ్చిమ గోదావరి, గుంటూరుతో పాటు తెనాలిలో ఒక్కో కేసు వ్యాప్తి. తెనాలిలో 74 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అతడికి మెరుగైన చికిత్స అందిస్తున్నాయి. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని. ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా ఒక్కటే కాదు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా అతడికి ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1009 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
వీటిలో దక్షిణాది రాష్ట్రమైన కేరళలో అత్యధికంగా 403 కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 209, దేశ రాజధాని ఢిల్లీలో 104, గుజరాత్‌లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 12 కేసులు ఉన్నాయి. ఈ కోవిడ్ కారణంగా కేరళలో ఇద్దరు, మహారాష్ట్రలో నలుగురు, కర్ణాటకలో ఒకరు మరణించారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు కొనసాగించండి. ఏవైనా తీవ్ర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.
What's Your Reaction?






