Top Story: ప్రైవేట్ హాస్పిటల్ దందా! అంతా డబ్బుతోనే-ప్రజలు విల విల
Top Story: ప్రైవేట్ హాస్పిటల్ దందా! అంతా డబ్బుతోనే-ప్రజలు విల విల

డబ్బే మతం- కార్పొరేట్ ఆసుపత్రుల క్రూర ముఖం. హాస్పిటల్ హాల్లో లగ్జరీ ఐసీయూ ముందు కన్నీళ్లు! కార్పొరేట్ ఆసుపత్రులు-గాజు గదుల్లో గల్లంతయ్యే మానవత్వంపై ఈ రోజు ప్రత్యేక కథనం శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే, ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిళీ అని మనం పురాణాల్లో చదువుకున్నాం.
మరి నేటి భారతంలో ఏమి జరుగుతుందో తెలుసుకుందామా! సూర్య స్టేట్ బ్యూరో చీఫ్ (హరీష్) ప్రజల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటూ కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. రూ. లక్షల్లో ఫీజుల రూపంలో వసూళు చేసి చివరికి శవాలను అప్పగించారంటూ ఎన్నో సంఘటనలను మీడియాలో చూశాం.
కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ దైవంగా భావించేది వైద్యులనే. అందుకనే డాక్టర్ల ముందు ఎలాంటి అబద్ధం చెప్పరు. ఇక ప్రాణం కంటే డబ్బు ప్రాధానమైనది కాదని భావిస్తూ ఎంతైన ఖర్చు చేయడానికి సిద్ధ పడతాం ఒక మనిషికి నిజంగా ఉన్న ధనం ఏమిటంటే -ఆరోగ్యం. కానీ మనం రోజువారీ జీవితంలో దాన్ని పట్టించుకోకుండా, ఇతర సంపదల కోసం పరుగు తీస్తుంటాం. చివరికి అదే సంపదను ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు ఖర్చు చేయాల్సిన దుస్తితి ఎదురవుతుంది.
అక్కడినుంచే అసలు కథ మొదలవుతుంది. 4 అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న మనిషి. మానవత్వంతో నిండిన వైద్యం కోసం కాకుండా, మెరుపుగా మెరుస్తున్న హాస్పిటల్ బిల్డింగ్ కోసం వెతకడం మొదలుపెడతాడు. ఎందుకంటే మన ఊరిలో ఒక ఇంటర్ ఫెయిల్ అయిన డాక్టర్ గా చలామణి అవుతున్న ప్రాక్టీషనర్ దగ్గర కు వెళ్ళగానే, అతను చెప్పే మాట "గుంటూరులో ఓ కొత్త కార్పొరేట్ హాస్పిటల్ తెరవబడ్డింది. డాక్టర్లు బెస్ట్, హాస్పిటల్ మల్టీప్లెక్స్ లా ఉంటుంది. అక్కడికి వెళ్ళండి.” ( ఇంతే! మన ఆరోగ్యాన్ని చూసే వ్యక్తిని వెతకడం మానేసి, శోభాయమానంగా మెరుస్తున్న భవనాన్ని చూసేందుకు బయలుదేరుతాం.
అక్కడికి వెళ్ళగానే మొదలవుతుంది అసలు ఖర్చుల కథ సూర్య OFF THE RECORD వైఫై ఉంటుంది, కానీ కనెక్షన్ మానవత్వానికి ఉండదు. ( క్యాఫెటీరియా ఉంటుంది, కానీ డాక్టర్ను కలుసేటప్పుడు కస్టమర్ క్యూల్లో నిలబడి వేయాల్సి వస్తుంది. ( ఎస్కలేటర్ ఎక్కించుతుంది, కానీ జేబులో ఉన్న డబ్బు దిగుతుంది. 4 అద్దం మెరిసే గదులు ఉంటాయి, కానీ డాక్టర్ను చూపించేందుకు గంటల నడిపింపులు ఉంటాయి.
ఒకప్పుడు మనం ఆసుపత్రిలో అడిగే ప్రశ్న - "వైద్యం బాగా చేస్తారా?" ఇప్పుడు మనం అడిగే ప్రశ్న - "హాస్పిటల్ ఎంత పెద్దగా ఉందో చూశారా?” ఓపీ చూసేవాడు. ఇప్పుడు కొత్తగా కార్పొరేట్ హాస్పిటల్లో అదే డాక్టర్ 750కి ఓపీ చూస్తున్నాడు. డాక్టర్ మారలేదు. మారింది -భవనం! పెరిగింది ఖర్చు! అయితే ఆ డబ్బు ఎందుకు? మీరు ఖర్చు చేస్తున్నదేంటంటే, హాస్పిటల్ వాల్ డిజైన్, ఎస్కలేటర్, ఫౌంటెన్, గ్లాస్ డోర్లు... కానీ వైద్యం మాత్రం అదే! మనకు నిజంగా అవసరమేమిటి? * బిల్డింగ్ కాదు -నైపుణ్యం ఉన్న డాక్టర్. డిజైన్ కాదు - బాధను అర్థం చేసుకునే మనిషి. 4 ఫ్లోర్స్ కాదు - ఫాలోఅప్లో మన ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే ధృక్పథం.
వైద్యం అనేది వ్యాపారం కాదు - మానవతా సేవ. వైద్యం అనేది మల్టీప్లెక్స్ అనుభవం కాదు - ప్రాణాన్ని కాపాడే సంకల్పం. గుర్తుంచుకోండి: డాక్టర్ను వెతకండి, హాస్పిటల్ను కాదు. మీ ఆరోగ్యాన్ని బ్రాండ్కి అప్పగించకండి. నమ్మకానికి అప్పగించండి. మల్టీప్లెక్స్ అనుభవం కాకుండా, జీవితానికి అవసరమైన చికిత్స కోరండి. ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగి ఇంటికి ఇది మన వైద్యుల మార్పు కాదు - మన రావాలి మళ్లీ వెళ్లాలనిపించేలా కాదు, అభిప్రాయాల మార్పు. మళ్లీ వెళ్లనక్కర్లేదనిపించేలా ఉండాలి.
శ్రీ కార్పొరేట్ హాస్పిటల్స్ వెనుక వందల కోట్ల పెట్టుబడులు ఉంటాయి. ఒక డాక్టర్కు నెలకి ?10 లక్షల జీతం ఇవ్వాలంటే, ఆ ఖర్చు ఎవరివద్దనుంచి వస్తుంది? మీ జేబు నుంచే. ( మీ జీవితానికి విలువ ఇవ్వండి. హాస్పిటల్ డిజైన్కి కాదు - డాక్టర్ నైపుణ్యానికి గౌరవం ఇవ్వండి. వైద్యం అనేది మన హక్కు - వ్యాపారం కాదు. ఈ కథనం ఒక మాఫియా పై మాత్రమే అందరూ డాక్టర్లని ఉద్దేశించి కాదు.
What's Your Reaction?






